Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

లిక్కర్‌ కేసుతో సంబంధం లేదు.. ఎమ్మెల్సీ కవిత

లిక్కర్‌ కేసుతో తనకు సంబంధం లేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. లిక్కర్‌ స్కామ్‌ ఆరోపణలపై హైదరాబాద్‌ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్‌ బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్‌ ఆగమవుతున్నారని చూస్తున్నారన్నారు. ఇలాంటి వాటికి భయపడేది లేదన్నారు. తనను బద్నాం చేస్తే కేసీఆర్‌ భయపడతారనుకుంటే పొరపాటేనన్నారు. బిల్కిస్‌ బానో అంశంపై సమాధానం చెప్పడం లేదన్నారు. ప్రశ్నించే వారిపై నిరాధార ఆరోపణలు సరికాదన్నారు. కక్షపూరితంగా బీజేపీ తనపై ఆరోపణలు చేస్తోందన్నారు. విపక్షాలపై బట్టకాల్చి వేయడం బీజేపీ పని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img