Friday, April 26, 2024
Friday, April 26, 2024

లిక్కర్‌ కేసులో కీలక మలుపు.. అరబిందో ఫార్మా లిమిటెడ్‌ అధినేత శరత్‌ రెడ్డి అరెస్ట్‌..

ఢల్లీి ఎక్సైజ్‌ పాలసీ 2021-22 మనీలాండరింగ్‌ కేసులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం అరెస్టు చేసింది. అరెస్టయిన వారిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా లిమిటెడ్‌ అధినేత శరత్‌ రెడ్డి కాగా, మరో వ్యక్తి వినయ్‌ బాబు పెర్నోడ్‌ రికార్డ్‌ లిక్కర్‌ కంపెనీ అధికారి. వినయ్‌ బాబు పెర్నాడ్‌ రికార్డ్‌ అనే లిక్కర్‌ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో విచారణ వేగవంతం చేసిన అధికారులు.. రెండు రోజుల నుంచి శరత్‌ చంద్రారెడ్డి, వినయ్‌ బాబును విచారిస్తున్నారు. శరత్‌, వినయ్‌ బాబుకు కోట్ల రూపాయల మద్యం వ్యాపారం ఉన్నట్లు తెలిసింది. లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఇప్పటికే రాష్ట్రానికి చెందిన రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ డైరెక్టర్‌ బోయినపల్లి అభిషేక్‌, ముంబైకి చెందిన విజయ్‌ నాయర్‌, ఢల్లీికి చెందిన సమీర్‌ మహేంద్రును ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో సిసోడియాను సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో నంబర్‌వన్‌గా పేర్కొంది. కాగా ఇటు హైదరాబాద్‌, కరీంనగర్‌లో ఐటీ, ఈడీ సంయుక్తంగా సోదాలు చేస్తోంది. హైదరాబాద్‌ శ్రీనగర్‌లోని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ వద్దిరాజ్‌ రవిచంద్ర కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 11 గంటలుగా సొదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం కూడా ఈడీ, ఐటీ సంయుక్తంగా సోదాలు చేశాయి. కరీంనగర్‌, హైదరాబాద్‌ లో ఏకాలంలో ఈ సోదాలు చేశారు. గ్రానైట్‌ వ్యాపారి పాలకుర్తి శ్రీధర్‌ ఆఫీస్‌ లో ఈడీ సోదాలు చేశారు. పంజాగుట్టలోని శ్రీధర్‌ ఆఫీస్‌ లో ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాజేంద్రనగర్‌, హైదర్‌గూడలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో ఐటి, ఈడీ సంయుక్తంగా సోదాలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img