Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వచ్చే నాలుగు వారాలు అత్యంత కీలకం : డీహెచ్‌

కరోనాతోపాటు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే నాలుగు వారాలు అత్యంత కీలకమని తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ డీహెచ్‌ శ్రీనివాసరావు పేర్కొన్నారు. . ఈ సందర్బంగా గురువారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో 4 రెట్లు కేసులు పెరుగుతున్నాయన్నారు. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో పాజిటివిటీ రేటు పెరిగిందని, అయితే 90 శాతం కేసుల్లో లక్షణాలు లేవన్నారు. ‘ప్రజలంతా తప్పనిసరిగా ఇంటా, బయటా మాస్కు ధరించాలి. భౌతికదూరం పాటించాలని కోరుతున్నాం. టీకా తీసుకోనివారు వెంటనే తీసుకోవాలి. న్యూఇయర్‌ నుంచి కరోనా కేసులు పెరిగాయి. సంక్రాంతికి మరింత కేసులు పెరిగే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, సొంత వైద్యం చేసుకోవద్దు. కరోనా లక్షణాలున్నవారు వైద్యులను సంప్రదించాలి’ అని చెప్పారు. ప్రజారోగ్య సిబ్బందికి నేటి నుంచి సెలవులు రద్దు చేస్తున్నాం. వచ్చే 4 వారాలు ఎలాంటి సెలవులివ్వం. రాజకీయ నాయకులు, పార్టీలు, ప్రజాసంఘాలు వచ్చే నాలుగు వారాలు కార్యక్రమాలను నియంత్రించుకోవాలి. దీన్ని రాజకీయ పార్టీలు బాధ్యతగా తీసుకోవాలని డీహెచ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img