Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లీష్‌ మీడియంలో బోధన

: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది.ఈ సందర్భంగా పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల, డిజిటల్‌ విద్య, ఇంగ్లిష్‌ మీడియంలో బోధన, సంబంధిత అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. మొదటి విడతలో 3,000 స్కూళ్ళు అభివృద్ధి చేస్తామన్నారు. సెలవుల రోజులలోనే త్వరితగతిన స్కూళ్ల రంగులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ అన్ని బాగు చేస్తామని తెలిపారు. జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు ఆయా జిల్లాలో ఉన్న స్కూళ్లను పర్యవేక్షణ చేయాలని సూచించారు. జూన్‌ 12న మొదట విడత మన ఊరు మన బడి కింద స్కూల్‌లను బాగు చేయనున్నట్లు చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 1వ తరగతి నుండి 8 వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియంను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినట్లు మంత్రి స్పష్టం చేశారు. అలాగే పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌ కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సబిత వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img