Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను కొట్టాల్సిన అవసరం ఉంది : సీఎం కేసీఆర్‌

తరతరాలుగా భారతదేశం నిలబెట్టుకుంటూ వస్తున్న శాంతియుత సహజీవనాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాజ్యంగ పదవుల్లో ఉన్నవారే నేడు ఫాసిస్టు దాడులకు పాల్పడుతున్నారని కేసీఆర్‌ తెలిపారు. ఈ దుర్మార్గాన్ని చూసి కచ్చితంగా స్వాతంత్ర సమరయోధుల ఆత్మలు ఘోషిస్తాయని సీఎం పేర్కొన్నారు.గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు.భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్నదని తెలిపారు. నేడు భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే వెకిలి మకిలి ధోరణులు చోటు చేసుకుంటున్నాయి. మన రాష్ట్రంలోనూ మత చిచ్చురేపి రేపాలనీ, శాంతిని, సామరస్య వాతావరణాన్ని దెబ్బతీయాలనీ, తద్వారా అభివృద్ధిని ఆటంకపరచాలనీ విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలోని మేధావి లోకం, యువకులు, విద్యార్థులు, ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండి ఈ శక్తుల కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. మన తెలంగాణ సుదీర్ఘకాలం అనేక సంక్షోభాల్లో చిక్కి కొట్టుమిట్టాడిరదని కేసీఆర్‌ గుర్తు చేశారు. ఈ ఎనిమిదేళ్లుగానే కోలుకొని కడుపునిండా తింటూ, కంటినిండా నిద్ర పోతున్నది. ప్రశాంతంగా ప్రగతి పథంలో పయనిస్తున్నది. ఈ కీలక సమయంలో ఏ వర్గాన్నీ విస్మరించకుండా సకలజనులనూ విశ్వాసంలోకి తీసుకుంటూ ముందుకు నడిపించాలి. ఈ గురుతర బాధ్యత నేడు ముఖ్యమంత్రిగా నాపైనా, తెలంగాణ ప్రభుత్వంపైనా ఉంది. పూజ్య బాపూజీ ప్రశంసించిన గంగాజమునా తెహజీబ్‌ ను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడిపై ఉందని తెలియజేస్తున్నానని కేసీఆర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img