Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విజయ డెయిరీ పాల ధరలు పెంపు

టోన్డ్ మిల్క్ లీటర్‌పై రూ.3 పెరిగిన ధర
నిర్వహణ, రవాణా ఖర్చులు పెరగడంతో నిర్ణయం

విజయ డెయిరీ పాల ధరలు మళ్లీ పెరిగాయి. ఇటీవలే పాల ధరలు పెంచిన డెయిరీ తాజాగా లీటర్ పై మరో 3 రూపాయలు పెంచేసింది. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సామాన్యులపై మరింత భారం పడనుంది. టోన్డ్ మిల్క్ ధరను లీటర్‌పై గతంలో రూ.51 నుంచి రూ.55కు పెంచారు. తాజాగా రూ.58 కి పెంచింది. గతంలో అరలీటర్ డబుల్ టోన్డ్ మిల్క్ ధర రూ.26 కాగా పెంచిన ధరల ప్రకారం ప్రస్తుతం రూ.27కు చేరింది.సాధారణంగా పాల ధరలను పెంచే ముందు పాడి రైతులతో ప్రభుత్వం సమావేశం నిర్వహిస్తుంది. ఈసారి మాత్రం అలాంటి సమావేశం ఏదీ నిర్వహించకుండానే ధరలు పెంచేసింది. గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్వహణ ఖర్చులు పెరగడంతో పాటు రవాణా, పాల సేకరణ ధరలు కూడా పెరగడంతో అనివార్యంగా ధరలు పెంచాల్సి వచ్చిందని విజయ డెయిరీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img