Friday, April 26, 2024
Friday, April 26, 2024

విద్యకు రూ19వేల కోట్లు,వైద్యానికి రూ.12వేల కోట్లు , దళితబంధుకి రూ.17,700 కోట్లు కేటాయింపు

ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.. అలాగే మండలిలో మంత్రి ప్రశాంతరెడ్డి ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 2,90,396 కోట్లతో బడ్జెట్‌ ను ప్రతిపాదించారు.. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు కాగా,పెట్టుబడి వ్యయం రూ. 37,525 కోట్లు గా చూపారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 26,831 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఎయిర్‌ పోర్ట్‌ మెట్రోకి రూ.500 కోట్లు, పాతబస్తీ మెట్రోకి రూ.500 కోట్లు కేటాయించారు. డబుల్‌ బెడ్‌ రూం భవన నిర్మాణాలకు రూ.1200కోట్లు, కల్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్‌ పథకాలకు 3,250 కోట్లు, ఆర్టీసీకి 1500కోట్లు,
అదేవిధంగా నీటిపారుదల శాఖకు రూ. 26,885 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, విద్యుత్‌ రంగానికి రూ. 12,727 కోట్లు కేటాయించింది. విద్యా రంగానికి రూ. 19,093 కోట్లు .. వైద్య రంగానికి రూ. 12,161 కోట్లు కేటాయించారు.పరిశ్రమలకు రూ. 4,037 కోట్లు మూసీ అభివృద్ధి కోసం రూ. 200 కోట్లు దళితబందుకు రూ.17,700 కోట్లు కేటాయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img