Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విద్యుత్‌ వాహనాల వాడకం తప్పనిసరైంది

రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి జగదీష్‌ రెడ్డి

టి యస్‌ రెడ్కో ఆధ్వర్యంలో ఈవి ట్రెడ్‌ ఎక్స్పో విద్యుత్‌ వాహనాల ప్రదర్శనను శుక్రవారం రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి ప్రారంభించారు. ప్రదర్శన ప్రారంభోత్సవం అనంతరం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచానికి పర్యావరణ కాలుష్యం చాలెంజ్‌గా మారిన నేపథ్యంలో విద్యుత్‌ వాహనాల వాడకం తప్పనిసరైందని అన్నారు. 10 వేల విద్యుత్‌ మోటారు సైకిళ్ళు వినియోగంలోకి వచ్చినట్లైతే సంవత్సరానికి 250 కోట్ల రూపాయల పెట్రోల్‌ దిగుమతులు ఆదా చేసినవారం అవుతామన్నారు. పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ఐటి, పురపాలక,పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్‌ విద్యుత్‌ వాహనాల ను ప్రోత్సాహించడంతో పాటు వాహనాలు తయారీ చేస్తున్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. అంతే గాకుండా విద్యుత్‌ వాహనాల కవసరమైన బ్యాటరీ పరిశ్రమలను తెలంగాణ లో నెలకొల్పే విదంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తుందన్నారు.వాడకంలోకి వచ్చిన విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌ కు సందేహ పడొద్దని ఇప్పటికే 138 ఛార్జింగ్‌ కేంద్రాలను ప్రారంభించినట్లు మరో 600 ఛార్జింగ్‌ కేంద్రాల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img