Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విభజన హామీలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తా : కోమటిరెడ్డి

విశాలాంధ్ర ` హైదరాబాద్‌ : విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి కేంద్రాన్ని ప్రశ్నిస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అలాగే కేసీఆర్‌ అవినీతిని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని వివరించారు. నేడు నకిరేకల్‌ పట్టణంలోని స్వయంభూ కాళికమాత ఆలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఏడేళ్లుగా ఒక్క డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు సైతం కట్టలేదని సర్కార్‌ను విమర్శించారు. జిల్లా మంత్రిగా ఉన్న జగదీష్‌రెడ్డి డబుల్‌ బెడ్‌ రూమ్‌ నిర్మాణం, ప్రాజెక్టులకు నిధులు తీసుకురావాలని ఆలోచించకపోవడం సిగ్గుచేటన్నారు. నల్గొండ జిల్లాలో ఓ దళిత యువతి హత్య జరిగితే జగదీష్‌ రెడ్డి వెళ్లి పరామర్శించకపోవడం దిక్కుమాలిన రాజకీయాలకు నిదర్శనమని తెలిపారు. రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్‌ అవినీతిపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని తెలిపారు. అలాగే తెలంగాణకు రావాల్సిన నిధుల మీద కేంద్రాన్ని ప్రశ్నిస్తామ న్నారు. రాష్ట్ర విభజన చట్టంలో హైదరాబాద్‌ విజ యవాడ రహదారిని ఎక్స్‌ప్రెస్‌వేగా మారుస్తామని పొందుపర్చితే ఇప్పటికీ అటు వైపు అడుగులు వేయలేదని తెలి పారు. పేద పిల్లల చదువు కోసం, గురుకులాల అభివృద్ధి కోసం ఎంత గానో కృషిచేసిన గొప్పవ్యక్తి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అని పొగిడారు. అలాం టి వ్యక్తులపై దళిత బంధుకు వ్యతిరే కంగా మాట్లాడారని కేసులు పెట్టడం అన్యాయ మన్నారు. ఎవరైనా రాజకీయాల్లోకి రావాలను కుంటే స్వాగతించాలని కానీ ఇలా కేసులు పెట్ట డం తగదని వారించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికా రంలో ఉన్న లేకున్నా ప్రజల పక్షాన పోరాడుతా మన్నారు. తప్పకుండా ప్రజల అభివృద్ధి కొరకు సర్కార్‌పై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img