Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

వీధి కుక్కల దాడి ఘటనపై హైకోర్టు సీరియస్

హైదరాబాద్ లో వీధి కుక్కల దాడి ఘటనపై హైకోర్టు సీరియస్ అయ్యింది. మూడు రోజుల క్రితం నగరంలోని అంబర్ పేట్ లో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. వీధి కుక్కల దాడిలో నాలుగు ఏళ్ల బాలుడు మృత్యువాత పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అంబర్ పేటకు చెందిన ప్రదీప్ అనే బాలుడు నడుచుకుంటూ వస్తుండగా కుక్కలు చుట్టుముట్టి తీవ్రంగా గాయపరిచి బాలున్ని పొట్టనబెట్టుకున్నాయి. ఈ ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. కుక్కల దాడి కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన హైకోర్టు సీరియస్ అయింది. అతడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ కలెక్టర్, జిహెచ్ఎంసి కమిషనర్ ను ప్రతివాదులుగా చేర్చింది. జిహెచ్ఎంసి నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాడని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకుంటారని జిహెచ్ఎంసిని ప్రశ్నించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది హైకోర్టు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img