Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

వెల్‌నెస్‌ యాక్టివిటీస్‌లో మొదటిస్థానంలో తెలంగాణ

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేంద్రం నిర్వహించిన హెల్త్‌ అండ్‌ ఫిట్‌ నేషన్‌ కార్యక్రమంలో తెలంగాణ వైద్య రంగం పాల్గొన్నది. ఈ కార్యక్రమంలో భాగంగా వెల్‌నెస్‌ యాక్టివిటీస్‌లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవగా, ఎన్సీడీ స్క్రీనింగ్‌లో రెండో స్థానంలో నిలిచింది.నవంబర్‌ 16 నుంచి డిసెంబర్‌ 13వ తేదీ వరకు జరిగిన ఈ క్యాంపెయిన్‌ సబ్‌ సెంటర్‌ స్థాయిలో కేవలం మూడు లక్ష్యాలను నిర్దేశిస్తూ కొనసాగింది. ఒకటి ఒక సబ్‌ సెంటర్‌ పరిధిలో కనీసం 100 మందికి నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీసెస్‌ పరీక్షలు నిర్వహించడం, రెండోది సబ్‌ సెంటర్‌ పరిధిలో 10 వెల్‌నెస్‌ యాక్టివిటీస్‌ నిర్వహించడం, మూడోది సబ్‌ సెంటర్‌ పరిధిలో కనీసం 100 డిజిటల్‌ ఐడీలు సృష్టించడం. అయితే ఈ మూడిరటిలో రెండు విభాగాలకు రాష్ట్రానికి అవార్డులు వచ్చాయి. వెల్‌నెస్‌ యాక్టివిటీస్‌లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవగా, ఎన్సీడీ స్క్రీనింగ్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య సిబ్బందికి ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img