Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

వ్యక్తిగత సమస్యలపై చర్చ పెట్టొద్దు.. సీనియర్‌ నేతలకు రేవంత్‌ రెడ్డి వార్నింగ్‌

ఇటీవల సీనియర్‌ నేతలు తనపై చేసిన తిరుగుబాటుపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఎట్టకేలకు స్పందించారు. పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఎప్పుడూ ఉంటాయని, వ్యక్తిగత సమస్యలపై చర్చ పెట్టొద్దని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై చర్చ పెట్టాలని, మన సమస్యల కంటే ప్రజా సమస్యలు కీలకమని వ్యాఖ్యానించారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఎదుర్కొవడంపైనే చర్చ జరగాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్‌లో జరిగిన వేడుకల్లో రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం.. కాంగ్రెస్‌ శ్రేణులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘దేశ ప్రజల స్వేచ్చను కాపాడటానికే కాంగ్రెస్‌ ఆవిర్భవించింది. వివిధ ప్రాంతాలు, భాషల సంస్కృతిని కాంగ్రెస్‌ పార్టీ కాపాడిరది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రెస్‌ నాయకులది. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించాయి’ అని రేవంత్‌ పేర్కొన్నారు.‘విదేశీ శక్తుల కుట్రతోనే రాజీవ్‌ గాంధీ హత్య జరిగింది. దేశానికి కంప్యూటర్‌ పరిచయం చేసింది కాంగ్రెస్‌ పార్టీనే. దేశ సమైక్యత, సమగ్రత కోసం కాంగ్రెస్‌ పార్టీ కృషి చేసింది. మహత్మాగాంధీ, రాజీవ్‌ గాంధీ, ఇందిరాగాంధీ తమ ప్రాణాలను దేశం కోసం ఫణంగా పెట్టారు. ఇప్పుడు వారి వారసత్వాన్ని రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌ జోడో పాదయాత్ర రాహుల్‌ చేస్తున్నారు. తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిరది. బ్రిటిష్‌ పాలకులు అవలంభించిన విధానాలనే బీజేపీ సర్కార్‌ అవలంభిస్తుంది. మోడీ పాలనతో రూపాయి పతనం కావడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట మసకబారింది’ అని రేవంత్‌ ఆరోపించారు.’ బీజేపీ పాలన వల్ల స్వాతంత్రం రాకముందు దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయని రేవంత్‌ ఆరోపించారు. దేశంలో అప్పటి బ్రిటిష్‌ పాలకులు కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టారని, ఇప్పటి బీజేపీ ప్రభుత్వం కూడా అదే చేస్తుందని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. గతంలో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ఎలాంటి పదవులు తీసుకోకుండానే దేశ భద్రతను కాపాడారని రేవంత్‌ రెడ్డి తెలిపారు.దేశ సమైక్యత కోసమే రాహుల్‌ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు భారత్‌ జోడో పాదయాత్ర చేస్తున్నారని రేవంత్‌ పేర్కొన్నారు. గతంలో రాజీవ్‌ గాంధీ చార్మినార్‌ వద్ద జెండా ఎగురవేసి యాత్ర చేశారని, ఇప్పుడు రాహుల్‌ గాంధీ కూడా చార్మినార్‌ వద్ద భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి పాదయాత్ర చేసిన విషయాన్ని రేవంత్‌ గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img