Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు

: సీఎం కేసీఆర్‌
ఎరువుల ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎరువుల ధరలు విపరీతంగా పెంచి దేశ రైతాంగం యొక్క నడ్డి విరిచిందని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం ఉల్టా వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. జేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం అని నిర్ధారణ అయిందని స్పష్టం చేశారు. దేశ రైతాంగాన్ని బతకనిచ్చే పరిస్థితి లేదన్నారు.పండిరచిన ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గపు చర్యలు తీసుకుంటోందని అన్నారు. రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చాలని చేస్తోందన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందన్నారు. కరెంటు మోటార్లకు మీటర్లు బిగించి బిల్లులు వసూలు చేస్తున్నారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయకుండా నాన్చడం, విపరీతంగా ఎరువుల ధరలు పెంచి రైతుల ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గపు చర్యలకు పునుకుంటోందన్నారు. గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, అనుబంధ వృత్తులను నిర్వీర్యం చేసి, గ్రామీణ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేసి వ్యవసాయాన్ని కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్న బిజెపి పార్టీ ని కూకటివేళ్లతో పెకలించి వేయాలని దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎరువుల సబ్సిడీలను ఎత్తివేసి రైతులను వ్యవసాయం చేయకుండా చేస్తున్న బిజెపి కేంద్ర ప్రభుత్వంపై దేశ రైతాంగం నాగండ్లు ఎత్తి తిరగబడితే తప్ప వ్యవసాయాన్ని కాపాడుకొలేని పరిస్థితులు దాపురించాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కేంద్రానికి బుద్ధి వచ్చేదాకా ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. కేంద్రం తక్షణమే పెంచిన ఎరువుల ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు. కేంద్రం కుట్రలను రాష్ట్ర రైతాంగం అర్థం చేసుకుని బీజేపీ ప్రభుత్వంపై ధరలు తగ్గించే దాకా సాగే పోరాటంలో కలిసిరావాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.కాగా, ఎరువుల ధరల పెంపుపై తన నిరసన వ్యక్తం చేస్తూ సాయంత్రం ప్రధానికి బహిరంగ లేఖ రాయనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img