Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి 4వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. మంగళవారం ఉదయం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు 4వేల క్యూసెక్కుల నీళ్లను విడుదల చేశారు. బుధవారం సాయంత్రానికిది 6వేల క్యూసెక్కులకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. దీని వల్ల నిజామాబాద్‌ జిల్లాలోని కొంత భాగం, కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల, కరీంనగర్‌,పెద్దపల్లి, చొప్పదండి, ధర్మపురి, మంథని తదితర నియోజకవర్గాలలోని పంట పొలాలకు సమృద్ధిగా నీళ్లందుతాయి. వరి నాట్లు వేసేందుకు గాను నీళ్లను విడుదల చేయాలన్న ఆయకట్టు రైతుల కోర్కెను మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, ప్రశాంత్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ దృష్టికి తెచ్చారు. ముఖ్యమంత్రి వెంటనే సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలిచ్చారు.నీళ్లను విడుదల చేయడం పట్ల సీఎం కేసీఆర్‌కు ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img