సికింద్రాబాద్ బోయిగూడలో భారీ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. బుధవారం ఉదయం 4 గంటల సమయంలో బోయిగూడలోని ఓ టింబర్ డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అదుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. మంటల ధాటికి గోడౌన్ పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో పదకొండు మంది అక్కడికక్కడే మరణించారని అధికారులు చెప్పారు. వీరిలో కొందరు సజీవ దహనమవగా, మరికొందరు ఊపిరాడక చనిపోయారన్నారు. మరొకరు క్షేమంగా బయటపడ్డారని వెల్లడిరచారు. ప్రమాద సమయంలో టింబర్ డిపోలో 12 మంది ఉన్నారని తెలిపారు. మృతులంతా బీహార్‌కు చెందిన వలస కార్మికులని తెలిపారు.. అగ్నిప్రమాదం జరిగిన భవనంలో టింబర్ డిపో, స్క్రాప్ గోదాం ఉన్నాయని పోలీసులు చెప్పారు. టింబర్ డిపో నుంచి స్క్రాప్ గోదాముకు మంటలు వ్యాపించాయన్నారు. పొగ దట్టంగా కమ్ముకోవడంతో మృతదేహాలను వెలికితీయడానికి ఇబ్బందయిందని తెలిపారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.