Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

సికింద్రాబాద్‌ అల్లర్లతో మాకు సంబంధం లేదు : బల్మూరి వెంకట్‌

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిరసిస్తూ యువకుల ఆందోళనలతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతపై కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ స్పందించారు. రైల్వే స్టేషన్లో విధ్వంసానికి ఎన్‌ఎస్‌యూఐ సంఘాలు కారణమని వస్తున్న ఆరోపణలను ఖండిరచారు. తమకు ఈ అల్లర్లు, విధ్వంసంతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ ఓ వీడియో విడుదల చేశారు. అగ్నిపథ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష రద్దు కావడంతో కొన్ని గంటల వ్యవధిలో 44 మంది ఆత్మహత్య చేసుకున్నారని, దీంతో ఆవేశానికి లోనైన అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనతో ఎన్‌ఎస్‌యుఐకి ఎటువంటి సంబంధం లేదు. అభ్యర్థుల నిరసనలో మాకు ప్రమేయం ఉన్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అగ్నిపథ్‌ కొత్త విధానం వల్లే అభ్యర్థులు ఈ దాడులకు పాల్పడి ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. తాను ఉదయం ఓ ఈవెంట్‌కు వెళ్తుంటే తనను మధ్యలోనే అడ్డుకుని షహనాజ్‌ గంజ్‌ పీఎస్‌కు తరలించారని చెప్పారు. అందుకే తాను పోలీస్‌స్టేషన్‌లో ఉండి కూడా ఈ వీడియో ద్వారా స్పష్టంచేస్తున్నానని వెల్లడిరచారు. ఎవరూ ఇలాంటి దాడులకు పాల్పడవద్దని, ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకూడదని ఆందోళనకారులకు, అభ్యర్థులకు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img