ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టికి దళితబంధు పథకం నిదర్శనమని మంత్రి హరీష్ రావు ట్విట్టర్లో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. దళితబంధు పథకం కింద రూ. పదిలక్షల ఆర్థిక సాయం ఇవ్వడమే కాదు.. ప్రభుత్వ కాంటాక్టులూ, వ్యాపార లైసెన్సుల్లోనూ దళితులకు కోటా ఇవ్వడం దేశ చరిత్రలోనే ప్రథమం కావడం తెలంగాణకే గర్వకరాణమని పేర్కొన్నారు.