కరోనా సెకండ్ వేవ్ కారణంగా గత కొద్ది నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో మూతబడ్డ సినిమా థియేటర్లు త్వరలోనే తెరుచుకోనున్నాయి. ఈ నెల 23వ తేదీ నుంచి సినిమా థియేటర్లను తెరవాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ మురళీమోహన్, సెక్రటరీ సునీల్ నారంగ్.. ఎగ్జిబిటర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి థియేటర్లను తెరవడంపై నిర్ణయం తీసుకున్నారు.