Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

బతుకమ్మ పండుగ నేటితో ముగియనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు. దీంతో స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సోమవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని తెలిపారు.బషీర్‌బాగ్‌, పీసీఆర్‌ జంక్షన్‌, రవీంద్రభారతి, లిబర్టీ, ట్యాంక్‌బండ్‌, ఖైరతాబాద్‌, తెలుగుతల్లి, మోజంజాహి మార్కెట్‌, నాంపల్లి, అబిడ్స్‌, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల, అంబేద్కర్‌ విగ్రహం, కవాడిగూడ, కట్టమైసమ్మ ఆలయం, కర్బాలమైదాన్‌, బైబిల్‌ హౌస్‌, రాణిగంజ్‌, నల్లగుట్ట జంక్షన్లలో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని చెప్పారు. ఎల్బీ స్టేడియం, లిబర్టీ జంక్షన్‌తో పాటు అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్‌ రద్దీ ఉండే అవకాశం ఉందని అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img