వాతావరణ శాఖ సూచించినట్లుగానే నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కూకట్?పల్లి, కేపీహెచ్?బీ కాలనీ, ఆల్విన్?కాలనీ, బంజారాహిల్స్?, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్, మియాపూర్, మెహిదీపట్నం, జీడిమెట్ల, మాదాపూర్, గచ్చిబౌలి, గాజుల రామారం, దిల్ సుక్ నగర్, మణికొండ, ఎల్బీ నగర్, చింతల్ తోపాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై మ్యాన్?హోల్స్? పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని పలు ప్రధాప కూడలల్లో ట్రాఫిక్ స్థంభించడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వెంటనే అప్రమత్తమైన డీఆర్ ఎఫ్, మాన్సూన్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు.