Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

హైదరాబాద్‌లో హై అలెర్ట్‌ – మెట్రో రైలు సర్వీసులు నిలిపివేత

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లో అల్లర్ల నేపథ్యంలో హైదరాబాద్‌ వ్యాప్తంగా మెట్రో రైలు సర్వీసులను నిలిపివేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు అధికారులు ముందస్తు చర్యలలో భాగంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి నిర్ణయాన్ని ప్రకటించారు. నగరంలో పలు ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులు సైతం రద్దయ్యాయి.
ముందు జాగ్రత్తగా ఎంఎంటీఎస్‌ సేవలు రద్దు..
నగరంలో నెలకొన్న కొన్ని పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌ లోని మూడు లైన్లలో మెట్రో రైలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశాం. మెట్రో రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి, ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసుకోవాలి. తదుపరి ప్రకటన వచ్చే వరకు హైదరాబాద్‌లో మెట్రో రైలు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో రైలు అధికారిక ట్విట్టర్‌ ద్వారా వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img