Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. 3 రోజులపాటు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

భారీ వర్షాలు కురుస్తుండటంతో ట్విస్‌ సిటీస్‌లో తిరిగే పలు ఎంఎంటీఎస్‌ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. హైద్రాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలలో పలు ఎంఎంటీఎస్‌ సర్వీసులను నేటి నుంచి మూడు రోజులపాలు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రైళ్ల రద్దుకు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసింది. జూలై 11 నుంచి జూలై 13 వరకు 72 గంటలపాటు ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులు అందుబాటులో ఉండవని అధికారులు తెలిపారు. నగరంలో నడిచే మొత్తం 34 ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు చేశారు.
రద్దయిన ఎంఎంటీఎస్‌ సర్వీసుల వివరాలు..
హైదరాబాద్‌ – లింగంపల్లి మార్గంలో 9 సర్వీసులు – 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120
లింగంపల్లి – హైదరాబాద్‌ మార్గంలో 9 సర్వీసులు – 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140
ఫలక్‌నుమా – లింగంపల్లి మార్గంలో 7 సర్వీసులు – 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170
లింగంపల్లి – ఫలక్‌నుమా మార్గంలో 7 సర్వీసులు – 47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192
లింగంపల్లి – సికింద్రాబాద్‌ మార్గంలో 1 సర్వీసు – 47195
సికింద్రాబాద్‌ – లింగంపల్లి మార్గంలో 1 సర్వీసు – 47150 సర్వీసు రద్దు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img