Friday, April 19, 2024
Friday, April 19, 2024

12వ తేదీకి తెలంగాణ అసెంబ్లీ వాయిదా

తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి. అనంతరం ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, జనార్ధన్‌ రెడ్డిల మృతికి తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది. అసెంబ్లీని 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. ఈ సమావేశాలలో భాగంగా తెలంగాణ ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజన్సీస్‌ రూల్స్‌ 2022 బిల్లును రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ సభలో ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు ఈ సమావేశాల్లో ప్యానెల్‌ స్పీకర్లుగా రెడ్యా నాయక్‌, మోజం ఖాన్‌, హనుమంత్‌ షిండేల పేర్లను స్పీకర్‌ పోచారం ప్రకటించారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఎసీ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకొంటారు.
గోదావరి వరదలపై శాసనమండలిలో చర్చ..
ఇటీవల కురిసిన వర్షాలు, గోదావరి వరదలతో జరిగిన నష్టంపై శాసనమండలిలో చర్చ మొదలైంది. వరదల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి వివరించారు. సీఎం కేసీఆర్‌ సైతం ఈ ప్రాంతానికి వచ్చి స్వయంగా పరిశీలించారని గుర్తుచేశారు. భద్రాచలం ప్రాంతాల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయాలు కేటాయించినట్లు చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా సాయం అందలేదని మండలిలో వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img