Friday, March 31, 2023
Friday, March 31, 2023

14,939 అప్పీళ్లు, 8,008 కంప్లైంట్లు పరిష్కారం

తెలంగాణ సమాచార కమిషన్‌
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పెండిరగ్‌ కేసులతో సహా మొత్తం 14,939 అప్పీళ్లు, 8,008 కంప్లైంట్లు పరిష్కరించిందని ఒక ప్రకటనలో తెలంగాణ సమాచార కమిషన్‌ తెలిపింది. ఒక్క 2021 సంవత్సరం లోనే 4,646 అప్పీళ్లు, 2,608 కంప్లయింట్లు పరిష్కరించినట్టు వెల్లడిరచింది. మొత్తం 104 అప్పీళ్లులో మొత్తం రూ. 2,92,000 పెనాల్టీ రూపంలో విదించిందని, వాటి రికవరీ బాధ్యత సంబంధిత శాఖా అధికారులకు అప్పజెప్పిందని తెలిపింది. కొవిడ్‌ క్లిష్ట సమయంలోను టెలిఫోన్‌ ద్వారా విచారణలు జరిపి కేసుల సత్వర పరిష్కారం కొరకు కృషి చేసిందని తెలిపింది. కమిషన్‌ ఏర్పడిన నాటి నుండి 2020 సంవత్సరం వరకు వార్షిక నివేదికలను తయారు చేసి, శాసన సభ ఆమోదం కొరకు ప్రభుత్వానికి సమర్పించిందని పేర్కొంది.అన్ని ప్రభుత్వ శాఖల నుండి 2021 సంవత్సరం నకు సంబంధించి వార్షిక నివేదికలు అందిన వెంటనే ఆ వార్షిక నివేదిక కూడా పంపేందుకు సన్నద్ధంగా వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img