Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

16న రాష్ట్ర కేబినెట్‌ సమావేశం

ఈ నెల 16న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగనున్నది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం సమావేశం జరుగనున్నది. సమావేశాల నిర్వహణతో పాటు దళితబంధు పైలెట్‌ ప్రాజెక్టు అమలుపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం హుజూరాబాద్‌తో పాటు వాసాలమర్రిలో పైలెట్‌ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నది. మరో నాలుగు గ్రామాల్లోనూ పైలెట్‌ ప్రాజెక్టును అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. మంత్రివర్గ సమావేశంలో పథకం అమలుపై పూర్తిస్థాయిలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img