Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

19న మోదీ తెలంగాణ రాక..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 19న ప్రధాని మోడీ రాష్ట్రానికి రానున్నారు. ప్రధాని పర్యటనలో భాగంగా సికింద్రాబాద్‌లో వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలును ప్రారంభించనున్నారు.. అనంతరం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ను రూ.700 కోట్లతో చేపట్టనున్న ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అట్లాగే ఖాజీపేట ఓవరాలింగ్‌ వర్క్‌ షాప్‌ పనులను రిమోట్‌ ద్వారా ప్రారంభిస్తారు. అట్లాగే రూ.1231 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్‌ – మహబూబ్‌ నగర్‌ రైల్వే డబ్లింగ్‌ పనులను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో మొత్తం రూ.2400 కోట్ల వ్యయంతో రైల్వేకు సంబంధించి వివిధ అభివృద్ది పనులను ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా పెరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు..కాగా, ప్రధాని పర్యటన ఏర్పాట్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ చర్చించారు. ఇందులో భాగంగా సోమవారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ను సందర్శించి దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను బండి సంజయ్‌, లక్ష్మణ్‌ లకు వివరించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. ప్రధాని రాక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బండి సంజయ్‌, లక్ష్మణ్‌ రైల్వే అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం బండి సంజయ్‌తో కలిసి లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. ప్రధాని పర్యటన కార్యక్రమాలకు వివరించారు. తెలంగాణ ప్రయోజనాలకు ప్రధాని మోడీ పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే రూ.1.04 లక్ష కోట్ల వ్యయంతో తెలంగాణలోని జాతీయ రహదారులను నిర్మాణాన్ని కేంద్రం చేపట్టిందన్నారు. ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానానికి చేరుకుందన్నారు. ‘‘నూతన సంవత్సర కానుకగా ప్రధాని మోదీ తెలంగాణలో రైల్వే అభివృద్ధి పనుల కోసం రూ.2400 కోట్లకుపైగా నిధులు ఖర్చు చేయబోతున్నారని తెలిపారు. సమీక్షా సమావేశం అనంరతం అనంతరం బండి సంజయ్‌, లక్ష్మణ్‌ నేరుగా సికింద్రాబాద్‌ లోని పరేడ్‌ గ్రౌండ్‌ ను సందర్శించారు. ఈనెల 19న ప్రధాని రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో పరేడ్‌ మైదానంలో చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img