Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

2022 డిసెంబర్‌ కల్లా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పార్కు ప్రారంభం : కేటీఆర్‌

హైదరాబాద్‌కు దగ్గరలోని దండుమల్కాపురంలో ఎంఎస్‌ఎంఈ-గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో అతి విశాలమైన, అన్ని వసతులు ఉన్న నైపుణ్య శిక్షణా కేంద్రం (స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌) డిసెంబర్‌ 2022 సరికల్లా అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ విషయాన్ని తెలపడానికి సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. ఈ పార్కు ద్వారా తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరగనున్నాయని తెలిపారు. ఇండస్ట్రీయల్‌ పార్కులు నెలకొల్పి, వాటిల్లో స్కిల్‌ డెవపల్‌మెంట్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూ, వారికి ఉపాధి అవకాశాలు పెంచడమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని కేటీఆర్‌ ప్రకటించారు. 547 ఎకరాల్లో విస్తరించి, 589 ఎంఎస్‌ఎంఈ యూనిట్ల స్థాపనకు వీలుగా ఏర్పాటు చేసిన దండుమల్కాపురం ఎంఎస్‌ఎంఈ-గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ద్వారా ప్రత్యక్షంగా 20 వేల మందికి, పరోక్షంగా 16 వేల మందికి ఉపాధి లభిస్తుందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img