Friday, June 2, 2023
Friday, June 2, 2023

23న తెలంగాణకు అమిత్ షా

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా.. తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖ‌రారైంది. ఈ నెల 23 తెలంగాణకు అమిత్ షా రానున్నారు. దీంతో తెలంగాణ బీజేపీ నాయ‌కులు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమిత్ షా సభలో కీలకమైన చేరికలు ఉండే ఛాన్స్ ఉందంటున్నారు బీజేపీ వర్గాలు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు చెప్పినట్లు ఆ పార్టీలో ఎవరు చేరుతారు చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూపల్లి బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. అయితే వారు బీజేపీలో చేరుతారో లేదో వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img