Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

29న హైదరాబాద్‌కు రాష్ట్రపతి

రాష్ట్రపతి రామ్‌నాథ కోవింద్‌ దక్షిణాది విడిది ఖరారైంది. ఈ నెల 29న రాష్ట్రపతి రాష్ట్రానికి రానున్నారు.సికింద్రాబాద్‌ రాష్ట్రపతి నిలయంలో కోవింద్‌ బస చేయనున్నారు. వచ్చే నెల మూడో తేదీ వరకు రాష్ట్రపతి హైదరాబాద్‌లో ఉండనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులతో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సమావేశమయ్యారు. రాష్ట్రపతి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన మేరకు రహదార్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, కంటోన్మెంట్‌ బోర్డు సీఈవోలకు సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img