Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

5న మహారాష్ట్రలో సీఎం కేసీఆర్‌ బహిరంగసభ..

జాతీయ పార్టీ విస్తరణలో భాగంగా ఈ నెల 5న మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు అతిథిగా బీఆర్‌ఎస్‌ చీఫ్‌, సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లును పరిశీలించారు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి. సభా వేదిక, వాహనాల పార్కింగ్‌ ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు. నాందేడ్‌ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలు, తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్‌ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున సభకు హాజరుకానున్నారు. అందువల్ల కట్టుదిట్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని.. అందరూ సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు.టీఆర్‌ఎస్‌.. బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత నిర్మల్‌ జిల్లా సరిహద్దు ప్రాంతమైన నాందేడ్‌లో సభ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సభలో పలువురు జాతీయ పార్టీల నాయకులు పాల్గొంటారని వెల్లడిరచారు.ఇక ఫిబ్రవరి 5న తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరగనుంది. రాష్ట్ర బడ్జెట్‌ 2023-24కు అమోదం తెలపనుంది కేబినెట్‌. అనంతరం బహిరంగసభలో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్‌.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img