రామకృష్ణ మఠ్‌లో స్పోకెన్ ఇంగ్లిష్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా కోర్సులు
స్పోకెన్ ఇంగ్లిష్‌కు దరఖాస్తుల ఆహ్వానం
రామకృష్ణ మఠ్‌లోని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆధ్వర్యంలోఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రామకృష్ణ మఠ్ హైదరాబాద్ అధ్యక్షుడు స్వామి బోధమయానంద పేర్కొన్నారు. జూన్ నుంచి ఆగస్టు వరకు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్ కోర్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే 11 నుంచి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
అర్హత వివరాలు
స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సుకు కనీస అర్హత 10వ తరగతితోపాటు 15 నుంచి 60 ఏండ్లవారు అర్హులుగా నిర్ణయించారు. స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సుకు విదేశీయులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సులో ఐదు స్థాయిలు ఉంటాయి. బేసిక్, జూనియర్, సీనియర్, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్-1 అండ్ 2. కాగా, విద్యార్థులు మాత్రం బేసిక్‌తోపాటు జూనియర్ స్థాయిల్లో జాయిన్ కావచ్చు. ప్రతి సెషన్‌లో మూడు నెలల పాటు మొత్తం 36 క్లాసులు ఉంటాయి.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు
పదో తరగతి మార్కుల మెమోతోపాటు ఏదైనా గుర్తింపు కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెస్స్, పాస్‌పోర్టు, తదితర ఐడీలను చూపవచ్చు. ఆన్‌లైన్ ద్వారా తరగతులను వినాలనుకునే వారు ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ తరగతుల కోసం వివేకానంద ఇనిస్టిట్యూట్‌కు వెళ్లి దరఖాస్తు చేసి అడ్మిషన్ పొందాల్సిందే.
ఫీజు వివరాలు
స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సుకు భారతీయులైతే రూ.1500, విదేశీయులకైతే రూ.4000గా నిర్ణయించారు. విద్యార్థులు మాత్రం ఈవినింగ్ కానీ, మార్నింగ్ బ్యాచ్‌లను ఎంచుకోవచ్చు. ఇతర వివరాలకు ఇనిస్టిట్యూట్ వెబ్‌సైట్ ద్వారా https://rkmath. org/spoken -english/ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సు వివరాలను తెలుసుకోవచ్చు.
ఇతర భాషల్లోనూ శిక్షణ
రామకృష్ణమఠ్‌లో ఇంగ్లిష్‌తోపాటు చైనీస్, ఫ్రెంచ్, జర్మ న్, హిందీ, జపనీస్, సంస్కృతం అండ్ స్పానిష్ భాష ల్లో శిక్షణ పొందేందుకు https://rkmath.org/ other languages/వెబ్‌సైట్లో సంప్రదించవచ్చు. ఏ మైనా సందేహం వస్తే వాట్సాప్ 9603578545 ద్వా రా ఉదయం 8నుంచి 6గంటల వరకు సంప్రదించాలి.