అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలకు టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో మహిళా బంధు కేసీఆర్ పేరిట సంబరాలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాల్లో భాగంగా ఈ నెల 6వ తేదీన పార్టీ మహిళా నాయకులు కేసీఆర్‌కు రాఖీలు కట్టాలని కేటీఆర్ సూచించారు. పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు, స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లతో పాటు ప్రతిభ కలిగిన విద్యార్థినిలు, తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మానం నిర్వహించాలన్నారు. కేసీఆర్ కిట్, షాదీ ముబారక్, థాంక్యూ కేసీఆర్ ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటు చేయాలని కేటీఆర్ సూచించారు.7న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్‌తో పాటు ఇతర సంక్షేమ పథకాల లబ్దిదారుల నివాసాలకు టీఆర్ఎస్ నాయకులు నేరుగా వెళ్లి కలవాలన్నారు. అనంతరం లబ్దిదారులతో ముచ్చటించి, సెల్ఫీలు తీసుకోవాలని సూచించారు.8న నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం సంబరాలు నిర్వహించాలని కేటీఆర్ చెప్పారు.