టీఎస్‌ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదముద్ర వేశారు. నెల రోజుల తర్వాత ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఉద్యోగుల ప్రాతినిధ్యాలు మరియు కార్పొరేషన్ యొక్క మొత్తం సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని తాను చేసిన పది సిఫార్సులకు ప్రతిస్పందనగా ప్రభుత్వ చర్యలను క్షుణ్ణంగా అంచనా వేసిన గవర్నర్ చివరకు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమోదముద్ర వేశారు. తాను చేసిన 10 ప్రాతిపదనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పదించిందని గవర్నర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ కార్మికులకు తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు.