Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

మంచిర్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దారుణం

బాలింత ప్రాణం మీదకు వచ్చిన వైద్యుల నిర్లక్ష్యం

పొట్టలో దూది మర్చిపోయి అలాగే కుట్లు వేసిన డాక్టర్లు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అయితే కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. తాజాగా.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం వెలుగులోకి వచ్చింది. డెలివరీ సమయంలో ఆపరేషన్‌ చేసి.. కడుపులోనే కాటన్ పాడ్‌ వదిలేశారు డాక్టర్లు. దీంతో ఆ బాలింత ప్రాణాల మీదకు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఐదు రోజుల క్రితం వేమనపల్లి మండలంలోని నీల్వాయి గ్రామానికి చెందిన కీర్తి లయకు పురిటి నొప్పులు రాగా.. కుటుంబ సభ్యులు ఆమెను మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఆమెకు సిజేరియన్ చేసి డెలివరీ చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయి.. కీర్తి లయ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆపరేషన్‌ సమయంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి.. కాటన్ ప్యాడ్‌ను ఆమె కడుపులోనే వదిలేసి కుట్లేశారు. దీంతో కీర్తి లయ తీవ్ర అస్వస్థతకు గురైంది. సోమవారం రాత్రి ఆమె పరిస్థితి మరింత విషమించటంతో కుటుంబ సభ్యులు చెన్నూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కీర్తి లయను టెస్టులు నిర్వహించిన డాక్టర్లు.. కడుపులో కాటన్ ప్యాడ్ ఉందని గుర్తించారు. ఆపై ఆపరేషన్ చేసి దాన్ని బయటకు తీశారు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ ఘటనపై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రసవం కోసం వస్తే ప్రాణాలు మీదకు తెస్తారా..అని మండిపడుతున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యంపై మీడియాలో కథనాలు రావటంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఘనటపై విచారణకు ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img