విశాలాంధ్ర -కూకట్ పల్లి : ఆర్టీసీ భూములు కొట్టేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వంలో విలీనం చేశారాని, ఎన్ని రోజులు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తే పట్టించుకోని బీఆరెస్ పార్టీ ఎలక్షన్స్ రాగానే విలీనం అనే డ్రామా ఆడుతున్నారని కూకట్పల్లి కాంగ్రేస్ అభ్యర్థి బండి రమేష్ అన్నారు. నియోజకవర్గం కోర్డినేటర్ డాక్టర్ సత్యం శ్రీరంగం సీనియర్ నాయకులు గొట్టే ముక్కల వెంకటేశ్వరావు సర్ధార్ పాపారాయుడు , వడ్డేపల్లి నర్సింగరావుల విగ్రహానికి పువ్వులు సమర్పించి శ్రీకాకుళం బస్తీ , విజ్ఞాన్ పూరి , మేత్రినగర్, సాయిబాబా నగర్ కాలనీ దయగూడలో పాద యాత్ర చేసి ఆరు గ్యారెంటీ ల పథకాలను ప్రచారం చేస్తూ వివరాలు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ నియోజకవర్గం లో చాలా సమస్యలు ఉన్నాయని, ఈ సారీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నన్ను గెలిపించి అసెంబ్లీ కీ పంపిస్తే దశలవారీగా తీరుస్తాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మేకల రమేష్ సీనియర్ నాయకులు సురేష్, రమేష్, గోపి, లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.