Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలి

స్పీకర్ ను కలసిన బీఆరెస్ ఎమ్మెల్యేలు
విశాలాంధ్ర – హైదరాబాద్ : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పై స్పీకర్ అనర్హత వేటు వేయాలని కోరుతూ మంగళవారం బీఆరెస్ ఎమ్మెల్యేల బృందం స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయమైన, అక్రమమైన చేరికల అంశాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం పార్టీ ఫిరాయింపుల అంశంలో మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఉందనే విషయాన్ని స్పీకర్ కి గుర్తు చేశామన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో మారిన మరో 9 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ కు ఫిర్యాదు చేయటం జరిగిందని తెలిపారు. ఇప్పటికే దానం నాగేందర్ పైన ఇచ్చిన ఫిర్యాదు పైన వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరామని, మణిపూర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ మారిన సంఘటనలో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఆయన పై అనర్హత వేటు వేశారని గుర్తు చేశారు. స్పీకర్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పరిధిలోనే ఉన్నారని, కాబట్టి ఇక్కడ కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు వెంటనే నిర్ణయం తీసుకోవాలని లేదంటే పదవికి అగౌరవంగా ఉంటుందన్న విషయాన్ని ఆయనకు తెలియజేశానట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఉన్న విషయాన్ని కూడా స్పీకర్ కి చదివి వినిపించామని, మూడు నెలల్లోగా స్పీకర్ కి అందిన ఫిర్యాదుల పైన కచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉందన్నారు. మణిపూర్ ఎమ్మెల్యే విషయంలో స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను కోరటం జరిగిందని పేర్కొన్నారు. ఢిల్లీలో ఓ రాజ్యాంగాన్ని కాపాడుతామని రాహుల్ గాంధీ ఫోజులు కొడుతున్నారు కానీ మరోవైపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అదే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేలా వ్యవహరిస్తోందన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో పార్టీ ఫిరాయింపుపై గగ్గోలు పెట్టే రాహుల్ గాంధీ, తెలంగాణలో మాత్రం ఎమ్మెల్యేల ఫిరాయింపులను వెన్నుతట్టి మరి ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టో పార్టీ మారితే ఆటోమేటిక్ గా సభ్యత్వం రద్దు అని అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య రూ.50 కోట్లకు ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేను బీజేపీ కొనేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారని, మరి తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయో పరిశీలించాలని కోరడం జరిగిందన్నారు. అలాగే గోవాలో కాంగ్రెస్ అభ్యర్థులను పార్టీ మారమని రాహుల్ గాంధీ శపథం చేయించిన అంశాన్ని కూడా స్పీకర్ వద్ద ప్రస్తావించామని, హర్యానా, హిమాచల్ లో పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన స్పీకర్ కి ఫిర్యాదు చేస్తే వారు సానుకూల నిర్ణయం తీసుకున్నారని స్పీకర్ కు వివరించామని చెప్పారు. ఈ అంశంలో నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ పదవికి ఎలాంటి కళంకం రాదనే తీరుగా ప్రభుత్వాధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక పార్టీపై గెలిచిన అభ్యర్థులు ఇంకో పార్టీ లోకి వెళ్లొద్దు అనే విషయాన్ని స్పష్టం చేశారని, స్పీకర్ గొప్ప ఆలోచన విధానాన్ని అభినందిస్తున్నట్లు తెలిపామన్నారు. ఇంటర్వ్యూలలో మాత్రమే కాకుండా మేము ఇచ్చిన ఫిర్యాదు పైన వెంటనే చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. స్పీకర్ పైన మాకు విశ్వాసం ఉందని, వెంటనే ఆయన పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. ఒకవేళ ఆయన నిర్ణయం తీసుకోకపోతే తప్పకుండా సుప్రీంకోర్టు వెళ్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో దుర్మార్గమైన పరిస్థితిలు,….
రేవంత్ రెడ్డి పాలనలో దుర్మార్గమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని, పార్టీ మారని మా ఇద్దరూ ఎమ్మెల్యేలకు స్థానికంగా ఉండే ఇద్దరు డీఎస్పీలు ఫోన్ చేసి మీకు ప్రాణ భయం ఉందనే విషయాన్ని పరోక్షంగా హెచ్చరించారన్నారు. బీజేపీని వాషింగ్ మిషన్ పార్టీగా విమర్శించిన కాంగ్రెస్ అదే పనిని తెలంగాణలో చేస్తోందని దుయ్యబట్టారు. మా పార్టీ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి ఆస్తులు, భవనాలపైన దాడులు చేస్తున్నారని, కొంతమందికి ప్రాణగండం ఉందంటూ పార్టీ మారేలా ఒత్తిడి తెస్తూ బెదిరిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. మరి కొంతమంది ఎమ్మెల్యేల వ్యాపారాలపై దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్న ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ద్వారా బెదిరిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో నరేంద్ర మోడీ రాజ్యాంగబద్ధ సంస్థలను ఉపయోగించుకున్నట్లుగానే ఇక్కడ చోటే భాయ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ విభాగాలను ఉపయోగించుకుని మా ఎమ్మెల్యేలను బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని చేసినా సరే ప్రజాక్షేత్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను కచ్చితంగా ప్రజలు శిక్షిస్తారన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img