Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కులవృత్తులను ఆదుకోవడం కోసమే ఆర్థిక సహాయం : వినోద్‌కుమార్‌

వెనకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి కోసం మొదటి మెట్టుగా బీసీ బంధును ప్రభుత్వం ప్రారంభించిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్ తెలిపారు.వేములవాడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ గార్డెన్ లో శుక్రవారం సంక్షేమ సంబురాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అక్కడే ఏర్పాటుచేసిన సభలో ఆయన తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2002లో కేసీఆర్ నాయకత్వంలో దళిత పాలసీని ముందుగానే ప్రకటించామని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్నామని తెలిపారు. గోదావరి, కృష్ణ నదులను మళ్లించి కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని వివరించారు. రైతులకు ఎకరానికి రూ. 10 వేల పంట పెట్టుబడి సాయం ప్రపంచంలో మరెక్కడా లేదని స్పష్టం చేశారు.దశాబ్ది ఉత్సవాలు జరుపుకునేట్లుగానే వచ్చే పదేళ్ల వరకు చేయవలసిన అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కరీంనగర్‌ వాసులు హైదరాబాద్‌లాంటి నగరాలకు వెళ్లకుండా స్థానికంగానే ఆసుపత్రులను నెలకొల్పుతూ వైద్యసేవలను అందుబాటులో ఉంచారని వెల్లడించారు.కార్యక్రమంలో కలెక్టర్ అమరాగ్ జయంతి, ఎమ్మెల్యే రమేశ్ బాబు, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, ఎంపీపీలు భూర వజ్రమ్మ, బైరగొని లావణ్య, గంగం స్వరూప రాణి, జవ్వాజి రేవతి, ఉమా దేవి, చంద్రయ్య గౌడ్, జడ్పీటీసీలు మ్యకల రవి, గట్ల మీనయ్య, నాగం భూమయ్య, మాజీ మార్కె ఫెడ్ చైర్మన్ లోకబాపురెడ్డి, అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img