ఐకమత్యానికి నిదర్శనం గ్యార్మీ పండగ:
గౌసే పాక్ దర్గా వద్ద దువా ప్రత్యేక ప్రార్థనల
పాల్గొన్న మత గురువు హజ్రత్ సయ్యద్ జిలానీ పాషా ఖాద్రి
మైనార్టీ నాయకులు సయ్యద్ ఖలీల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
పాల్గొన్న రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి
విశాలాంధ్ర -అమనగల్లు : ఐకమత్యానికి నిదర్శనం గ్యార్మీ పండగని రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి అన్నారు. అమనగల్లు పట్టణంలో గురువారం గ్యార్మీ వేడుకలను ముస్లిం మైనారిటీలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.వేడుకలలో భాగంగా మౌలాలి పహాడ్ దర్గా సమీపంలోని గౌసే పాక్ చిల్లా వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ముస్లింల మత గురువు హజ్రత్ సయ్యద్ జిలాని పాషా ఖాద్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పట్టణ ముస్లిం మైనారిటీ లతో కలిసి గ్యార్మీ షరీఫ్ జెండాతో ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గౌసేపాక్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు, దువా కార్యక్రమాలు నిర్వహించారు. మైనార్టీ నాయకులు సయ్యద్ ఖలీల్ ఆధ్వర్యంలో అతని నివాసంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోటగిరి యాదవ్, మత గురువు లు మౌలానా అబ్దుల్ కరీం, అబ్దుల్ వాహెబ్, మైనార్టీ నాయకులు,బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.