Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

తెలంగాణలో రాగల ఐదురోజుల పాటుభారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ..!

తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చాలాప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చాలాప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం నుంచి బుధవారం వరకు కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే సూచనలున్నాయని అంచనా వేసింది. మంగళవారం నుంచి శనివారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పింది. శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడ భారీ వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఇవాళ్టి ఉదయం వరకు నిజామాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ములుగు, జయశంకర్‌ జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైందని టీఎస్‌డీపీఎస్‌ వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img