Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటనలో పేర్కొంది. ముఖ్యంగా గురు, శుక్ర (నేడు, రేపు) వారాల్లో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా హైదరాబాద్, మేడ్చల్ – మల్కాజ్ గిరి, యాదాద్రి, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వానలు పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది. సోలార్‌ రేడియేషన్‌ ఎక్కువగా ఉండటం వల్లనే రాష్ట్రం లో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా ఇలాంటి వాతావరణం వేసవిలోనే ఉంటుందని, ఆగస్టులో ఇలాంటి వాతావరణం దాదాపు ఉండదని అన్నారు. కానీ ఈ ఏడాది ఆగస్టులో వర్షాలు లేకపోవడంతో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. సాధారణంగా ఈ సమయంలో మేఘాలు ఏర్పడి సూర్యకిరణాలను అడ్డుకుంటాయి. కానీ వాతావరణంలో మార్పుల వల్ల మేఘాలు తక్కువగా ఏర్పడుతూ.. సూర్యకిరణాలు నేరుగా భూమిపై ప్రసరిస్తుండటంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్నది. 32 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు 40 డిగ్రీల వరకు ఉంటున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగాయి.


సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img