చంద్రబాబుకు బెయిల్ తిరస్కృతిపై నారాయణ
విశాలాంధ్ర`ఖమ్మం: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు బెయిల్ తిరస్కరించడం ఊహించినదేనని సీపీఐ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ, కేంద్ర హోంమంత్రి రాజకీయ ఆట ఆడుతున్నట్లు విమర్శించారు. చంద్రబాబు అరెస్టుకు సీఎం జగన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్, రివెంజ్ (కక్షసాధింపు) పాలన విధానాన్ని అనుసరిస్తున్నట్లు నారాయణ విమర్శించారు.