Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

బడంగ్‌పేట మేయర్‌ పారిజాత ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు.. 6న విచారణకు రావాలంటూ నోటీసులు

బడంగ్‌పేట మేయర్‌ పారిజాత నరసింహా రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. నగదు, పలు కీలక పత్రాలను అధికారులు తీసుకెళ్లారు. పారిజాతతోపాటు పలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ఇండ్లపై ఐటీ అధికారులు గురువారం ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, పారిజాత ఇంటి నుంచి అధికారులు అర్ధరాత్రి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా రూ.8 లక్షల నగదు, కొన్ని పత్రాలు తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది. అదేవిధంగా ఈ నెల 6న ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీచేశారు. వ్యాపార లావాదేవీలకు పన్ను ఎగవేత జరిగినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఆమె మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీచేయాలనుకున్న విషయం తెలిసిందే. కాగా, హహేశ్వంరం కాంగ్రెస్‌ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి నివాసంతోపాటు, రిలయ్‌ ఎస్టేట్‌ ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సమీప బంధువు, రియల్టర్‌ గిరిధర్‌ రెడ్డి ఇండ్లపై కూడా దాడులు జరిగాయి. ఇక కేఎల్‌ఆర్‌ ఇంట్లో ఐటీ అధికారులు మరోసారి సోదాలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img