Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Friday, October 4, 2024
Friday, October 4, 2024

మల్లవల్లికి మహార్దశ.. త్వరలో లేలాండ్ ప్లాంట్ పునఃప్రారంభం

మల్లవల్లికి మహార్దశ ఉ త్వరలో లేలాండ్ ప్లాంట్ పునఃప్రారంభం

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న మల్లవల్లికి మహర్దశ పట్టింది. గ‌త ప్ర‌భుత్వ నిరంకుశ ప‌రిపాల‌నకి విసిగిపోయి, వారి విధానాల‌తో ఫ్యాక్ట‌రీ న‌డ‌ప‌లేక మూసివేసిన అశోక్ లేలాండ్ సంస్థ కృష్ణ‌జిల్లా బాపులపాడు మండలంలోని మ‌ల్ల‌వ‌ల్లిలో తయారీ ప్లాంట్ ను పునః ప్రారంభించేందుకు సిద్దమ‌వుతుంది. 2019లో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మూసివేసిన ఫ్యాక్ట‌రీని తిరిగి ప్రారంభించాల‌ని కోరుతూ విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్, 2024 జూలై 29వ తేదీ అశోక్ లేలాండ్ కంపెనీ చైర్మ‌న్ ధీర‌జ్ జి. హిందూజ కి లేఖ రాయ‌టం జ‌రిగింది. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి కావ‌టంతో ఎపిను పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు చేస్తున్న కృషి వివ‌రించ‌టం జ‌రిగింది. ప్లాంట్ ప్రారంభిస్తే దాదాపు 5 వేల మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవ‌కాశం దొరుకుతుంద‌ని వివ‌రించారు. ఎంపి లేఖ‌కు ఆ కంపెనీ చైర్మ‌న్ ధీర‌జ్ జి. హిందూజ సానుకూలంగా బ‌దులిచ్చారు. మ‌ల్ల‌వ‌ల్లి ప్లాంట్ లో త‌మ‌ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త‌యారు చేయ‌డం ల‌క్ష్యమ‌ని తెలియ‌జేశారు. ప్లాంట్ లో కార్యక‌ల‌పాలు మొద‌లుపెట్టేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి స‌హ‌కారం అవ‌స‌రం అవుతుంద‌న్నారు. ఈ విష‌యంలో స‌హ‌క‌రించాల‌ని కేశినేనిని కోరారు.

ఈ విష‌యం పై రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టి.జి.భ‌ర‌త్ తో సంస్థ మేనేజ్మెంట్ టీమ్ క‌లుస్తుంద‌ని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ప్లాంట్‌ను పునరుద్ధరించడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రగతికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి గా వున్న‌ట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img