Monday, September 25, 2023
Monday, September 25, 2023

కుమార్తె ప్రేమ వివాహం.. దగ్గరుండి జరిపించిన ఎమ్మెల్యే రాచమల్లు

  • కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎమ్మెల్యే కుమార్తె రాచమల్లు పల్లవి తను ప్రేమించిన పవన్ కుమార్ తో వివాహం జరిగింది. గురువారం ఎమ్మెల్యే రాచమల్లు దగ్గరుండి వివాహం జరిపించారు. మొదట సాంప్రదాయ బద్దంగా బొల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్దల మద్య ప్రేమికులిద్దరూ వివాహం చేసుకున్నారు.
  • అనంతరం ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఎమ్మెల్యే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూౌ తనకు తన కుమార్తె ఇష్టా ఇష్టాలు ముఖ్యమని, కులాలు, మతాలు, ఆస్తులు, అంతస్తులు, హోదాలు తమకు పట్టింపు కాదన్నారు. తన కుమార్తె పల్లవిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img