విశాలాంధ్ర కూకట్పల్లి: చైతన్యవంతమైన నియోజకవర్గం కూకట్పల్లి అని, అలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కూకట్పల్లి బీజేపీ, జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ అన్నారు.
బాలాజీ నగర్ డివిజన్ వివేక్ నగర్ లో గల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర చేశారు. అనంతరం మాట్లాడుతూ దేశం అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నరేంద్ర మోడీ కేంద్రంలో మరొకసారి బిజెపి గవర్నమెంట్ రావాలని, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధా రాజలింగం, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ. సూర్యారావు, వినోద్ గౌడ్, యంజాల పద్మయ్య, గంధం రాజు, సత్యనారాయణ, ఆకుల రాము, నాగరాజు, ప్రసాద్, కొల్లా శంకర్, సాలాదిశంకర్ , వినోద్, ప్రవీణ్, నీడి ప్రసాద్, చందు, సాయికిరణ్, రాజు నాయక్, శ్రీకాంత్, కే ఎం ఎస్ రెడ్డి, ఆకుల రాము, శంకర్ సెల్వాడి, బిజెపి నాయకులు, జనసేన నాయకులు, మహిళలు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.