Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

తెలంగాణకు వర్ష సూచన…

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, నేటికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే శనివారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రాబోయే మూడు రోజుల పాటు, మిగిలిన జిల్లాలకు శనివారం రోజుకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్‌లో రాబోయే కొన్ని గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img