Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

స‌ర్వ‌ర్ డౌన్.. ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద అభ్య‌ర్ధులు ప‌డిగాపులు

  • తెలంగాణ పీజీటీ గురుకుల ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహణలో సాంకేతిక సమస్య తలెత్తింది. సర్వర్‌లో సమస్య తలెత్తడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టి ఇంగ్లీష్‌ పరీక్షకు అంతరాయం ఏర్పడింది. ఉదయం 8:30 నుంచి 10.30 గంటల వరకు ఈ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే, సర్వర్‌లో సాంకేతిక సమస్య కారణంగా పరీక్ష ఆలస్యమైనట్లు పరీక్షా కేంద్రాల నిర్వాహకులు వెల్లడించారు.దీంతో అభర్థులను చాలాసేపటి వరకు లోపలికి అనుమతించలేదు. ఫలితంగా ఇతర ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చిన అభ్యర్థులు పడిగాపులు కాశారు. కొన్ని ప్రాంతాల‌లో అభ్య‌ర్ధులు ఆందోళ‌న‌కు దిగారు . ఎట్టకేలకు 10.16 గంటలకు పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించారు. స‌ర్వ‌ర్ ప‌నిచేయ‌డంతో 11 గంట‌ల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img