వేల ఎకరాలు కాజేసిన హరీష్‌రావు – గాదిద ముఖం మల్లారెడ్డి చేసిన కాబ్జాలు అనేకం
విశాలాంధ్ర – మల్కాజిగిరి : ప్రాజెక్టు నిర్మాణాల్లో వాటాలు తీసుకుంటూ… నాణ్యతలో లోపాలపై దృష్టి సారించకపోవడంతోనే మేడిగడ్డ, అన్నారం, కరీంనగర్‌లో కేబుల్ బ్రిడ్జిల పరిస్థితి దారుణంగా తయ్యారయ్యాయని మల్కాజిగిరి శాసన సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మైనంపల్లి హన్మంతరావు పేర్కొన్నారు. తనపై చేసిన వాఖ్యలను ఖండిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మంత్రి హరీష్ రావు సంగారెడ్డిలో అసైడ్ భూమి 1000 ఎకరాలు, సికింద్ర పురంలో 500 ఎకరాలు వక్ఫ్ భూమిని నోటీఫికేషన్‌కు ముందు క్లీయర్ చేయించుకున్నారని, ప్రజల సొమ్మును కాజేయడమే లక్ష్యంగా వారు పని చేస్తున్నారని ఆయన తెలిపారు. అంతేకాక ధరణిపేరిట వేలాది ఎకరాలను కాజేశారన్నారు. ఇసుక పేరిట లక్షల కోట్లు కాజేశారని మెదక్ పరిధిలోని గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధిని సాధించలేదని 20కోట్లు అభివృద్ది కూడ చేయలేదని ఆయన ఆరోపించారు. డబుల్ బెడ్‌రూం పేరుతో 10యేళ్ళుగా ప్రజలను ఊరిస్తున్నారని, గ్రేటర్‌లో 4.5లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్పి నియోజకవర్గానికి 1000 ఇండ్లను కూడ ఇవ్వలేకపోయారని ఆయన తెలిపారు. బఫూన్ మంత్రికి ఏం మాట్లాడాలో తెలియదని, స్థలాలను కబ్జాలు చేయడంలో దిట్టా అని ఆయన తెలిపారు. తన తప్పులను నిరూపిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానన్నారు. తాను 4వ అంతస్తు నుండి లిఫ్టులో క్రిందపడి కాలు విరిగింది. అయినా విరిగిన కాలుతో నియోజకవర్గంలోకి వచ్చి అభివృద్ధి పనులు చేపట్టిన విషయం తెలుకోవాలి గాడిద ముఖం మల్లారెడ్డి అని ఆయన హెచ్చరించారు. పైస కూడ వదలని మల్లారెడ్డి, తన అల్లుడు టోపి రాజలు ఆధార్ కార్డు లేకపోతే చికిత్స చేయని పరిస్థితి అని, ఆధార్‌తో బిల్లులు పెట్టుకుంటారని, మూడు లక్షలకు ఒక్క రూపాయి కూడ తగ్గించకపోతే సన్‌షైన్‌లో చేరి చికిత్స చేయించుకున్నారని ఆయన తెలపారు. ఇలాంటి వారె సేవ గురించి చెప్పుకోవడం దారుణమన్నారు. ఇవ్వాల డబ్బులిచ్చి పిడి యాక్ట్‌లు ఉన్నోడితో, పత్తాలు ఆడేవానితో మాట్లాడిస్తున్నారు. విద్యార్ధులను సమావేశానికి తీసుకువస్తున్నావు, సిబ్బందిని సమావేశాలకు తీసుకువస్తున్నావు, ఎవరు అక్రమాలు చేస్తున్నారు అని ప్రశ్నించారు. నా కొడుక్కు టికెట్ అడగద్దు అంటే నీ అల్లుడుకి ఎందుకు టికెటు ఎందుకు తెచ్చుకున్నావు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీవు చేసిన అభివృద్ధిని చెప్పు, గోవిందా అంటున్నవు నీపార్టీ గోవిందా, హరీష్ రావు గోవిందా, ఆ వెంకటేశ్వర స్వామే నన్ను బయటికి పోయే విధంగా ఆ వెంకటేశ్వరస్వామి మాట్లాడించాడన్నారు.