Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వడగాల్పులే!

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు ఎండ, వడగాల్పుల ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. అదే సమయంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 19 నుంచి కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలపైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img