Friday, September 22, 2023
Friday, September 22, 2023

15న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రాక..

ఈనెల 15వతేదీన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఆయన ఈ పర్యటనలో భాగంగా భద్రాచలం, ఖమ్మంలో పర్యటించనున్నారు. ముందుగా ఆయన ప్రత్యేక చాపర్ లో భద్రాచలంకు రానున్నారు. ఆరోజు ఉదయం 9గంటలకు భద్రాద్రి రామయ్యను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఐటీసీ గెస్ట్ హౌస్ కు చేరుకోనున్నారు. అక్కడే రాష్ట్ర బీజేపీ నేతలతో ఆయన చర్చలు జరపనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు ఖమ్మంలో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img